తీరానికి కొట్టుకొచ్చిన కంటైనర్లు.. మహారాష్ట్రలో హై అలర్ట్

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్ర సముద్ర తీరానికి మూడు కంటైనర్లు కొట్టుకురాగా.. అధికారులు వాటిని అనుమానాస్పద కంటైనర్లుగా గుర్తించి అప్రమత్తమయ్యారు.

తీరానికి కొట్టుకొచ్చిన కంటైనర్లు.. మహారాష్ట్రలో హై అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సముద్ర తీరానికి మూడు కంటైనర్లు కొట్టుకురాగా.. అధికారులు వాటిని అనుమానాస్పద కంటైనర్లుగా గుర్తించి అప్రమత్తమయ్యారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్ బీచ్ లకు కంటైనర్లు కొట్టుకురాగా.. తీరప్రాంత భద్రతా దళాలు, విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్ చేశారు. తీరప్రాంత గ్రామాల్లో సైతం అలర్ట్ ప్రకటించారు. తీరాల్లో ఎలాంటి వస్తువులు కనిపించినా వాటిని ముట్టుకోవద్దని తెలిపారు. ఎలాంటి వస్తువులు కనిపించినా వెంటనే నేవీ సిబ్బందికి సమాచారమివ్వాలని మత్స్యకారులు, గ్రామస్తులకు సూచించారు.

కాగా.. తీరానికి కొట్టుకువచ్చిన ఆ కంటైనర్లలో ఏముందన్న విషయంపై కోస్ట్ గార్డు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో కంటైనర్లను ఓపెన్ చేయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా.. ఆగస్టులో ఒమన్ కు చెందిన కార్గోషిప్ నుంచి సుమారు 48 కంటైనర్లు జారి సముద్రంలో పడ్డాయని, అవే ఇక్కడికి కొట్టుకొచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Next Story