- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: మూడు దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీ
23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం మొదటిసారి కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీకిది తొలి విదేశీ పర్యటన. ఐదు రోజుల పాటు ఉండే ఈ పర్యటనలో భాగంగా సైప్రస్, కెనడా, క్రొయేషియాలలో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఆదివారం సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీని దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడొలైడ్స్ స్వాగతించారు. 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం మొదటిసారి కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పునరుత్పాదకత, ఇంధన్, కౌంటర్ టెర్రరిజం వంటి అంశాల్లో సహకారం దిశగా చర్చలు నిర్వహిస్తారు. జూన్ 15,16 తేదీల్లో సైప్రస్‌లో ఉన్న తర్వాత అక్కడి నుంచి కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. ప్రధాని మోడీ వరుసగా ఆరోసారి ఈ సమావేశానికి హాజరవుతుండటం విశేషం. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలు, ఏఐ సంబంధాలు, క్వాంటం సమస్యలతో పాటు గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలపై అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే, వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలోనే ప్రధాని మోడీ పలు ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక చివరగా, జూన్ 18న క్రొయేషియా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తారు. దీని ద్వారా ఓ భారత ప్రధాని క్రొయేషియాను సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది. ఆ దేశ ప్రధాని ప్లెంకొవిక్‌తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం జూన్ 19న తిరిగి భారత్‌కు చేరుకుంటారు.






