అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ముగ్గురు భారతీయులు

by Muthe.Rajitha |

రష్యా రక్షణలో ఉన్న వెనెజువెలాకు చెందిన ఒక భారీ ఆయిల్ నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ముగ్గురు భారతీయులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో జనవరి 7న అమెరికా కోస్ట్ గార్డ్, మిలిటరీ బలగాలు రష్యా జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది ఉక్రెయిన్ పౌరులు, ఆరుగురు జార్జియా పౌరులు, ముగ్గురు భారతీయులు, కెప్టెన్‌తో సహా ఇద్దరు రష్యన్లు ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది. ప్రస్తుతం సిబ్బంది అందరూ అమెరికా అధికారుల అదుపులో ఉన్నారు. అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ నౌక వెనెజులా నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తోంది.

అయితే ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమని రష్యా ఖండించింది. మానవీయ కోణంలో సిబ్బందిని, విదేశీయులను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనతో అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఇప్పటివరకు ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story