శత్రుదేశంతో సంబంధాలు..ఇరాన్‌లో ముగ్గురికి ఉరి, 700 మంది అరెస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-25 15:27:10  IST  )

ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య యుద్ధం నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఒప్పందం కుదిరింది.

శత్రుదేశంతో సంబంధాలు..ఇరాన్‌లో ముగ్గురికి ఉరి, 700 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య యుద్ధం నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు సీజ్ ఫైర్‌కు ఆమోదం తెలిపాయి. కాగా ఇరాన్ ఇప్పుడు తమ దేశంలోనే ఉంటూ ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ సంస్థకు సహకరించిన ముగ్గురు ఇరానియన్లను ఉరి తీసింది. శత్రుదేశంతో సంబంధాలు ఉన్న మరో 700 మందిని అరెస్ట్ చేసింది.

ఇజ్రాయెల్‌తో సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్న తరవాత మరుసటి రోజే ఇరాన్ గూఢచర్యం చేసినవాళ్లపై నిఘాపెట్టి ఉరితీయడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా నౌర్ న్యూస్ ప్రకటించింది. పుట్టిన దేశానికే ద్రోహం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇండియాలోనూ కొంతమంది పాక్‌తో యుద్ధం సమయంలో గూఢచర్యం చేసిన సంగతి తెలిసిందే. అందులో చాలా వరకు యూట్యూబర్లు ఉన్నారు. అయితే భారత్ వారిని విచారిస్తోంది. ఈ క్రమంలో వారికి కూడా ఇరాన్ మాదిరిగా శిక్షను అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story