పుల్వామాలో మరో ఘటన.. CRPF జవాన్లపైకి దూసుకొచ్చిన లారీ (వీడియో)

by Disha Web Desk 2 |
పుల్వామాలో మరో ఘటన.. CRPF జవాన్లపైకి దూసుకొచ్చిన లారీ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అవంతిపుర వద్ద జాతీయ రహదారి పక్కన చెకింగ్ పాయింట్‌లో ఆగి ఉన్న సీఆర్ పీఎఫ్ వాహనాన్ని అతివేగంగా దూసుకువచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్ పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా తడిచిపోయి ఉంది. తడిసిన రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమలో అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపు ఉన్న సీఆర్ పీఎఫ్ వాహనంపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గతంలో పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో పదుల సంఖ్యలో ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.


Next Story