జైల్లో నుంచే జడ్జికి బెదిరింపు మెయిల్

by Muthe.Rajitha |

ఓ సైబర్ నేరంలో జైల్లో ఉన్న ఖైదీ.. అక్కడి నుంచి ఏకంగా జడ్జికే బెదిరింపు మెయిల్ చేసాడు.

జైల్లో నుంచే జడ్జికి బెదిరింపు మెయిల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ సైబర్ నేరంలో జైల్లో ఉన్న ఖైదీ.. అక్కడి నుంచి ఏకంగా జడ్జికే బెదిరింపు మెయిల్ చేసాడు. ఈ ఘటన లఖ్‌నవూలో చోటు చేసుకోగా.. జాతీయ మీడియాలో సంచలనం రేపుతోంది. సైబర్‌ నేరం కేసులో నిందితుడిగా ఉన్న అనుభవ్ మిత్తల్.. జైల్లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్ ఫోన్ ద్వారా బెదిరింపు ఇ-మెయిల్‌ పంపినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సుమారు 7 లక్షల మందిని రూ.3,700 కోట్ల మేర మోసం చేసిన అనుభవ్‌ ప్రస్తుతం లఖ్‌నవూ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. లఖ్‌నవూ బెంచ్‌లోని ఓ న్యాయమూర్తిని హత్య చేయబోతున్నారంటూ అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తికి ఇ-మెయిల్ పంపాడు. పోలీస్‌ కానిస్టేబుల్‌ అజయ్‌ కుమార్‌ ఫోన్‌ నుంచి ఆ ఇ-మెయిల్‌ పంపినట్లు గుర్తించారు సైబర్ సెల్, క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు.

అజయ్ కుమార్ ను, అనుభవ్ ను విచారించగా.. ఆ బెదిరింపు మెయిల్ పంపి... మరో ఖైదీని నేరంలో ఇరికించేందుకు తానే ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. దీనిపై మరింత లోతుగా విచారణ జరిపిస్తామని పేర్కొన్న ఉన్నతాధికారులు.. ఘటనకు కారణం అయిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసారు.

Next Story