రూ.10 కోట్లు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా.. కేంద్ర మంత్రికి బెదిరింపు కాల్స్

by S Gopi |

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్... Threatening calls to Union Minister Gadkari

రూ.10 కోట్లు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా.. కేంద్ర మంత్రికి బెదిరింపు కాల్స్
X

ముంబై: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ ఎదురయ్యాయి. నాగ్ పూర్‌లోని ఆయన పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయానికి మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఉదయం రెండు సార్లు, మద్యాహ్నం ఒకసారి పోన్ కాల్స్ వచ్చినట్టు డీసీపీ రాహుల్ మదానే తెలిపారు. కాల్స్ చేసిన వ్యక్తి జయేశ్ కాంత్ అని గుర్తించినట్టు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టగా పోన్స్ కాల్స్ వచ్చిన నెంబర్ మంగుళూరులో ఓ మహిళ పేరుతో ఉన్నట్టు గుర్తించారు. ఆమెకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు.

Next Story