- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rekha Gupta : ఢిల్లీ సీఎంకు బెదిరింపు కాల్స్.. భద్రత పెంపు
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta)కు బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta)కు బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చాయి. సీఎం రేఖా గుప్తాను చంపేస్తానంటూ ఓ ఆగంతకుడు గాజియాబాద్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. గాజియాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకారం.. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే ఆ వివరాలను ఢిల్లీ పోలీసులకు, సీఎం ఆఫీసుకు తెలియజేసి, అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. ఆ ఫోన్ కాల్ పై ఆరా తీయగా.. దుండగుడు మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిపారు. అయితే సిమ్ కార్డు ఓ మహిళ పేరుతో, నకిలీ డాక్యుమెంట్స్ తో తీసుకున్నట్టు తేలిందన్నారు.
ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ బెదిరింపు కాల్స్ తో రేఖా గుప్తా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీసులు. అదనపు సిబ్బందిని, సాయుధ గార్డులను మోహరించారు. గతంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రులపై బెదిరింపులు, దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి.






