- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్టుల భద్రతకు ముప్పు.. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
by Kema Shiva Kumar |
దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టులు, రన్‌వేలు, ఎయిర్ స్ట్రిప్స్, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూళ్లు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌కు కేంద్ర ఇంటెలిజెన్స్ (Central Intelligence) హెచ్చరికలు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టులు, రన్‌వేలు, ఎయిర్ స్ట్రిప్స్, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూళ్లు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌కు కేంద్ర ఇంటెలిజెన్స్ (Central Intelligence) హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య కాలంలో ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Bureau of Civil Aviation) ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఇతర సంబంధిత సంస్థలు కోఆర్డినేట్ అయి భద్రతను నిత్యం సమీక్షించాలని పేర్కొన్నారు. ఆయా ఎయిర్‌పోర్టులలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఏమైనా అనుమానాస్పద కదలికలు కంటబడితే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందజేయాలని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.
Next Story






