- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chat GPTపై నెటిజన్ల తిరుగుబాటు.. 25 లక్షల మంది బాయ్‌కాట్ .. రీజన్ ఇదే
ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీకీ ఊహించని షాక్ తగులుతోంది. అమెరికాతో చేసుకున్న ఒక్క డీల్ కొంప ముంచుతోంది.

డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్‌జీపీటీకి (ChatGPT) ఊహించని షాక్ తగులుతోంది. ఏకంగా 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని బాయ్ కాట్ చేశారు. ఉన్నట్టుండి 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని వదిలి పెట్టి ప్రత్యామ్నాయ చాట్ బాట్‍ల వైపు మొగ్గుచూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు నెత్తిన పెట్టుకున్న యూజర్లు ఇలా అకస్మాత్తుగా ఆగ్రహం వెలిబుచ్చడం వెనుక అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం అసలు కారణం.
కొంప ముంచుతున్న డీల్:
ఓపెన్ ఏఐ వివరణ:
వినియోగదారుల నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకతపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని చాలా హడావిడిగా చేశామని, స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అంగీకరించారు. పరిస్థితులను చక్కబెట్టడానికి ఎంతో నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు. అంతేకాదు.. పెంటగాన్‌తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేయడానికి ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.
ఆంథ్రోపిక్ నో చెబితే ఏఐ ఓకే:
నిజానికి అమెరికా రక్షణ శాఖ గతంలో ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించేది. ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ మోడల్స్‌ను అమెరికా మిలటరీ అపరిమతంగా, ఎలాంటి నియంత్రణలు లేకుండా వినియోగించుకొనేందుకు యాక్సెస్ ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అయితే ఇందుకు కంపెనీ అంగీకరించలేదు. దీంతో ట్రంప్ ఆంథ్రోపిక్‌కు గుడ్ బై చెప్పి ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకున్నారు. ఆంథ్రోపిక్ నో చెబితే ఓపెన్ ఏఐ ఓకే చెప్పడం పట్ల యూజర్లు మండిపడుతున్నారు. ఈ ఒప్పందానికి నిరసనగాచాట్ జీపీటీని వదిలేసి ఆంత్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన 'క్లాడ్' (Claude) చాట్‌బాట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి క్లాడ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది.






