- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thiranga yatra: రేపటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర.. కీలక అంశాలపై ప్రజలకు అవగాహన !
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర (Thiranga yatra) నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 13 నుంచి 23 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. బీజేపీ చీఫ్ నడ్డా (Nadda) అధ్యక్షతన తాజాగా జరిగిన సమావేశంలో ఈ డిసిషన్ తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. యాత్రలో భాగంగా ఆపరేషన్ సిందూర్, దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలు, భారత సైన్యం దైర్య సాహసాలు వంటి విషయాలపై ప్రజలకు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకులు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సమాచారం. బీజేపీ సీనియర్ నాయకులు సంబిత్ పాత్ర (Sambith pathra), జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే (Vinod thawde), తరుణ్ చుగ్ (Tharun chug) లు ఈ యాత్రను సమన్వయం చేయనున్నారు.
అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర సీనియర్ నాయకులు ఆయా రాష్ట్రాల్లో జరిగే యాత్రలో పాల్గొననున్నారు. అయితే ఈ ప్రచారం రాజకీయంగా ఉండబోదని, సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉన్న అంశంపై ప్రజలను ఏకం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ యాత్రలో మాజీ సైనికులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖ వ్యక్తులను భాగస్వాములను చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే.






