- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UP News : ఏకంగా జడ్జి మంగళసూత్రాన్నే కాజేసిన దొంగలు
వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొట్టేస్తే ఏముంది కిక్కు అని ఏకంగా జడ్జి మంగళసూత్రాన్నే కొట్టేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొట్టేస్తే ఏముంది కిక్కు అని ఏకంగా జడ్జి మంగళసూత్రాన్నే కొట్టేశారు. ఉత్తరప్రదేశ్(UP) లొ జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో విధులు నిర్వహిస్తున్న జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రేమ సాహు తన కుటుంబంతో కలిసి బృందావన్ ఆలయాన్ని(Brundavan Temple) దర్శించారు. రద్దీ ఎక్కువ ఉన్న క్రమంలో ఆమె మంగళసూత్రం చోరీ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న కొంతమందిని అరెస్ట్ చేసి విచారించగా.. వారివద్ద భారీగా పర్సులు, డబ్బులు లభించాయి. వారిని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపించారు పోలీసులు. అయితే జడ్జి మంగళసూత్రం మాత్రం ఇంకా దొరకలేదు. ఈ ఘటన యూపీలోని ఆలయాల్లో విపరీతమైన దొంగల బెడదని ప్రతిబింబిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






