Bengaluru: గర్ల్‌ఫ్రెండ్‌కు రూ. 3 కోట్ల బంగ్లా కట్టించిన ప్రొఫెషనల్ దొంగ..

by Shamantha N |

గర్ల్‌ఫ్రెండ్‌కు రూ. 3 కోట్ల బంగ్లా కట్టించిన దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని మడివాలా పోలీసులు మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన 37 ఏళ్ల పంచాక్షరి స్వామిని అరెస్టు చేశారు.

Bengaluru: గర్ల్‌ఫ్రెండ్‌కు రూ. 3 కోట్ల బంగ్లా కట్టించిన ప్రొఫెషనల్ దొంగ..
X

దిశ, నేషనల్ బ్యూరో: గర్ల్‌ఫ్రెండ్‌కు రూ. 3 కోట్ల బంగ్లా కట్టించిన దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని మడివాలా పోలీసులు మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన 37 ఏళ్ల పంచాక్షరి స్వామిని అరెస్టు చేశారు. అతడికి పెళ్లయి భార్య, బిడ్డ ఉన్నప్పటికీ స్త్రీలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాను దోచుకున్న డబ్బుతో తన గర్ల్ ఫ్రెండ్ కు రూ.3 కోట్ల ఇల్లు కట్టించినట్లు తెలిపారు. అతడికి ప్రముఖ సినీనటితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. 2014-15లోనే హీరోయిన్ తో పరిచయం ఏర్పరుచుకున్నాడని.. అప్పట్నుంచి ఆమెతో ప్రేమలో ఉన్నట్లు గుర్తించారు. ఆ నటి కోసం కోట్లు ఖర్చు చేసినట్లు అంగీకరించాడు. అతను కోల్‌కతాలో రూ. 3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించి, ఆమెకు రూ. 22 లక్షల విలువైన అక్వేరియంను బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2003లో మైనర్‌గా ఉన్నప్పుడే పంచాక్షరి స్వామి దొంగతనాలు చేయడం ప్రారంభించాడని దర్యాప్తులో తేలింది. 2009 నాటికి అతను ప్రొఫెషనల్ దొంగగా మారినట్లు పోలీసులు తెలిపారు. నేరాల ద్వారా కోట్ల విలువైన సంపదను కూడబెట్టినట్లు చెప్పుకొచ్చారు. అదంతా హీరోయిన్ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

రెండు సార్లు జైలుకు..

పంచాక్షరి స్వామి ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లాడు. 2016లో పంచాక్షరి స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు, ఆరేళ్ల పాటు అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. జైలు నుండి విడుదలైన తర్వాత అతను తిరిగి దొంగతనాలకు పాల్పడ్డాడు. తర్వాత మహారాష్ట్ర పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2024లో విడుదలైన తర్వాత, అతను తన స్థావరాన్ని బెంగళూరుకు మార్చాడు. అక్కడ ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు. జనవరి 9న బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో చోరీ చేశాడు. ఆధారాలు సేకరించిన తర్వాత మడివాలా మార్కెట్ ప్రాంతం సమీపంలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తన సహచరుడితో కలిసి బెంగళూరులో నేరాలు చేసినట్లు దర్యాప్తులో అతడు అంగీకరించాడు. చోరీ చేసిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చేందుకు వాడే ఇనుపరాడ్, ఫైర్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఆభరణాల నుండి తయారు చేసిన బంగారం, వెండి బిస్కెట్లను మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని తన నివాసంలో నిల్వ చేసినట్లు స్వామి వెల్లడించాడు. నిందితుడి నుంచి 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నేరాలు చేసిన తర్వాత దొరకకుండా ఉండేందుకు మధ్యలోనే దుస్తులు మార్చుకునేవాడని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా పంచాక్షరి స్వామి కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించాడని.. అతడి తండ్ర మరణం తర్వాత తల్లి రైల్వే శాఖలో ఉద్యోగం పొందిందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story