- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pakistan ceasefire: భారత్- పాక్ ఉద్రిక్తతలపైన మరోసారి స్పందించిన ట్రంప్
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. న్యూక్లియర్ మిస్సైల్స్ లో యుద్ధాలు చేయవద్దని కోరారు. పశ్చిమాసియా టూర్ లో ఉన్న ట్రంప్.. యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో మాట్లాడారు. ‘‘ఇరుదేశాల పరిస్థితి బాగుందని అనుకుంటున్నాను. వాళ్లని మనం ఒకచోట చేర్చవచ్చు. మార్కో రూబియో, వాళ్లు కలిసి బయటకు వెళ్లి మంచి విందు చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది కదా?’’ అని ట్రంప్ అన్నారు. తనను తాను శాంతికర్తగా చెప్పుకున్న ఆయన.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. దాని వల్ల లక్షలాది ప్రాణాలను కాపాడినట్లయ్యిందని పేర్కొన్నారు. శాంతి ప్రక్రియలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు పాలుపంచుకున్నారని కొనియాడారు
కాల్పుల విరమణ ఒప్పందం..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేయడంలో మా యంత్రాంగం విజయవంతమైందని ట్రంప్ అన్నారు. ‘‘ మిత్రులారా రండి..ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం..కొంత వ్యాపారం చేద్దాం..అణు క్షిపణుల వాణిజ్యం చేయొద్దు. అందరికీ ఆనందం కలిగేలా చేద్దాం. భారత్-పాక్ పాలకులు గొప్ప, శక్తిమంతమైన, ఉత్తమ, తెలివైన నేతలు అని చెప్పా.. దీంతో, యుద్ధం నిలిచిపోయింది. అది అలాగే కొనసాగాలని ఆశిద్దాం’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందన్న వ్యాఖ్యలను ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తమంత తాముగా అవగాహనకు వచ్చారని తెలిపాయి. ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.






