గ్యాంగ్‌గా వచ్చి మహిళ బట్టలు విప్పి.. గ్రామస్తుల ముందే..

by Disha Web Desk 9 |
గ్యాంగ్‌గా వచ్చి మహిళ బట్టలు విప్పి.. గ్రామస్తుల ముందే..
X

దిశ, వెబ్‌డెస్క్: కొందరు దుండగులు ఒక మహిళ దస్తులు విప్పేసి అమానుషంగా ప్రవర్తించిన ఘటన గుజరాత్ దాహూద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివాసి కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ తన భర్త, నలుగురు పిల్లలను వదిలేసి, మెహ్సానా జిల్లాలోని చనాస్మాలో ఒక వ్యక్తితో కలిసి జీవిస్తోంది. అక్కడ వారు రోజువారీ కూలీగా పని చేస్తుంటుంది. రాంపుర గ్రామంలో ఒక పెళ్లికి హాజరు కావాలని అతడి తల్లి వారిని పిలిచింది. అలాగే బాధితురాలి విడిపోయిన భర్తను కూడా ఆమె ఆహ్వానించింది. దీంతో అతడు కొంతమంది వ్యక్తులతో ఆ గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆ మహిళను, తన ప్రేమికుడిని కిడ్నాప్ చేసి.. తర్వాత వారిని మార్గాలా గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను జనాలు చూస్తుండగానే దుస్తులు విప్పి మరీ దారుణంగా కొడుతూ, నీచమైన బూతులు మాట్లాడాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎవరో తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

Next Story

Most Viewed