- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతువులు కూడా తినలేని ఆహారం మాకు పెడుతున్నారు.. పోలీస్ కానిస్టేబుల్ ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్: మెస్ లో తమకు పెడుతున్న బోజనం పై పోలీస్ కానిస్టేబుల్ నిరసన చేపట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: మెస్ లో తమకు పెడుతున్న బోజనం పై పోలీస్ కానిస్టేబుల్ నిరసన చేపట్టాడు. అందరూ అనుకున్నట్లు పోలీసులకు బిర్యానీ లు తినటం కానీ మంచి నాణ్యమైన భోజనం పెడతారు అనుకుంటాం. కానీ ఉత్తర ప్రదేశ్ యోగి ప్రభుత్వం లో నాణ్యమైన భోజనం అందడం లేదంటూ మనోజ్ కుమార్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఏడుస్తూ రోడ్డు పైకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మాట్లాడుతూ.. మాకు ఇచ్చే ఆహారం జంతువు కూడా తినదు , కానీ మాకు తినిపిస్తున్నారు. ఇది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిసిపి చేసిన మోసం అని తెలిపారు. ఈ వ్యక్తుల ద్వారా పోలీస్ సిబ్బందికి నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్నారు. పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం అందించడానికి వారికి ఇచ్చే అలవెన్సులను దాదాపు 30 శాతం పెంచుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చినప్పటికీ నాణ్యత లేని ఆహారాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు.






