Delhi: మహిళ సీఎంలలో ఢిల్లీ రికార్డు.. ఇప్పటి వరకు ఎంతమంది పాలించారంటే?

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పేరు మారుమోగుతుంది.

Delhi: మహిళ సీఎంలలో ఢిల్లీ రికార్డు.. ఇప్పటి వరకు ఎంతమంది పాలించారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పేరు మారుమోగుతుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించటంతో గురువారం (ఫిబ్రవరి 20) సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ తరపున సీఎంగా ఎంపికైన రెండో మహిళగా రేఖా గుప్తా నిలిచారు. ఇక మహిళలను సీఎం పీఠం ఎక్కించటంలోనూ ఢిల్లీ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఢిల్లీని పాలించిన మహిళ ముఖ్యమంత్రుల గురించి తెలుసుకుందాం.

పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, తమిళనాడు, పంజాబ్‌, రాజస్థాన్‌ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. అది కూడా ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే. కానీ, దేశ రాజధాని ఢిల్లీని అత్యధిక మంది మహిళ సీఎంలు పాలించారు. ఇప్పటి వరకు సీఎం పీఠాన్ని ముగ్గురు మహిళలు అధిరోహించారు. ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.

సుష్మా స్వరాజ్: రెండు దశాబ్ధాల క్రితం.. 1998లో దిగంవత సీఎం సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున ఢిల్లీకి తొలి మహిళా సీఎంగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.

షీలా దీక్షిత్‌: 1998లో కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్ సీఎం బాధ్యతలు చేపట్టారు. 2013 డిసెంబరు వరకు సేవలందించారు. చాలా సుదీర్ఘ కాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత ఈమెకే దక్కింది.

అతిషి మార్లెనా సింగ్: 8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు 2024లో బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 2025 కొనసాగారు.

రేఖా గుప్తా: ఢిల్లీ 9వ సీఎంగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. 2030 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది.

Next Story