అమెరికా షాకింగ్ నిర్ణయం..విమానాల్లో ఆ వస్తువులు తీసుకెళ్లడంపై నిషేదం

by Ajay Maddhiboyina |

విమాన ప్రమాదాలను అరికట్టేందుకు అమెరికా రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించేందుకు కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై నిషేదం విధించింది.

అమెరికా షాకింగ్ నిర్ణయం..విమానాల్లో ఆ వస్తువులు తీసుకెళ్లడంపై నిషేదం
X

దిశ‌, వెబ్ డెస్క్: విమాన ప్రమాదాలను అరికట్టేందుకు అమెరికా రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించేందుకు కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై నిషేదం విధించింది.చెక్ ఇన్ లగేజీలో లిథియం బ్యాటరీతో నడిచే మొత్తం ఏడు వస్తువులపై నిషేదం విధించింది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. చెక్ ఇన్ స‌మ‌యంలో ఈ వ‌స్తువుల‌ను నిషేదించిన‌ప్ప‌టికీ క్యారీ ఆన్ ల‌గేజీలో వీటిని తీసుకువెళ్లే వెసులుబాటు క‌ల్పించింది.

అమెరికా ర‌వాణా భ‌ద్ర‌తా సంస్థ నిషేదించిన వ‌స్తువుల్లో లిథియం ప‌వ‌ర్ బ్యాంకు, సెల్ ఫోన్ చార్జింగ్ బ్యాట‌రీ కేస్, స్పేర్ లిథియం మెట‌ల్ బ్యార‌టీ, స్పేర్ లిథియం అయాన్ బ్యాట‌రీలు, ల్యాప్ టాప్ బ్యాట‌రీలు, సెల్ ఫోన్ బ్యాట‌రీలు, ఎక్స్ ట‌ర్న‌ల్ బ్యాట‌రీ ప్యాక్ లు, పోర్ట‌బుల్ రీ ఛార్జీలు ఉన్నాయి. లిథియం బ్యాట‌రీల‌కు వేడెక్కే స్వ‌భావం ఉండ‌టం, థ‌ర్మ‌ల్ ర‌న్ వే అనే ప్ర‌మాద‌క‌ర రియాక్ష‌న్‌కు గురవుతాయని రవాణా భద్రతా సంస్థ పేర్కొంది. ఓవర్ చార్జింగ్, ప్యాకింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ వస్తువులపై నిషేదం విధించినట్టు స్పష్టం చేసింది.

Next Story