- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ యుగంలో ఉద్యోగాలు ఉంటాయి.. కానీ: రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
ఏఐ యుగంలో ఉద్యోగాలు ఉంటాయి.. కానీ నైపుణ్యాల లోపమే భారత్‌కు సవాలుగా మారిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐ యుగంలో ఉద్యోగాలు ఉంటాయి.. కానీ నైపుణ్యాల లోపమే భారత్‌కు సవాలుగా మారిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ (AI) చేతి పనులను పూర్తిగా తొలగించదని అభిప్రాయపడ్డారు. అయితే, మన విద్యా వ్యవస్థ కారణంగా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన కార్మికులు భారత్‌కు లభించకపోవచ్చని రఘురామ్ రాజన్ హెచ్చరించారు.
తాజాగా కుశాల్ లోధాతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాజన్.. భారత్‌లో యువతకు విద్య కంటే ప్రయోగాత్మక నైపుణ్యాలపై దృష్టి అవసరమని అన్నారు. ప్లంబర్లు, విమానం రిపేర్ వంటి కొన్ని ఉద్యోగాలకు ఎలాంటి సమస్య లేదని, అలాంటి ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు. మన విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజన్ చెప్పారు. నైపుణ్య వృత్తులకు గౌరవం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే సాంకేతిక కోర్సులు, అప్రెంటిస్‌షిప్‌లు పెంచాలని సూచించారు.
అలాగే చిన్ననాటి పోషకాహార లోపం ఉద్యోగ సిద్ధతపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పోషకాహార లోపాన్ని తగ్గించడం కీలకమని, లేకపోతే కార్మిక వర్గంలో పెద్ద భాగం అనిశ్చిత స్థితిలోనే మిగిలిపోతుందని ఆయన హెచ్చరించారు.






