- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరలవ్వడమే లక్ష్యం.. ఫొటోలు దిగేందుకు ఆ కోటకు పోటెత్తిన యువత
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే నెట్టింట దర్శనమిస్తోంది. ఈ క్రమంలో షాకింగ్, వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే, చాలా మంది యువత ఎక్కువగా అందమైన ప్రదేశాల్లోకి వెళ్లి ఫొటోస్, వీడియోలు తీస్తూ ట్విట్టర్, ఇన్ స్టాలో పోస్ట్ చేస్తారు. ఈ క్రమంలో వాటికి ఎక్కువ లైక్‌లు రావడంతో తెగ సంబరపడిపోతుంటారు. అయితే.. ఇటీవల వైరలవ్వడం కోసం యువత చేస్తున్న రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ వ్యక్తి దిగిన ఫొటో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో తెగ వైరలైంది. అంటే ఆ ఫొటోలో ఉన్న ప్రదేశం నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో వైరలవడం ఆలస్యం.. ఆ ప్రదేశంలో ఫొటో దిగి పోస్ట్ చేసేందుకు యూత్ సిద్ధమవుతున్నారు. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని నాసిక్ జిల్లా(Nashik District)లో ఉన్న హరిహర కోటకు వేలాది మంది తరలి వెళ్తున్నారు. ట్రెక్కింగ్ ప్రేమికులకు స్వర్గధామం హరిహర కోట(Harihara Fort). నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. 80 డిగ్రీల కోణంతో నిటారుగా ఉండే రాతి మెట్ల ద్వారా పైకి వెళ్లేందుకు భారీగా తరలివచ్చారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఎంతో మనోహరంగా ఉంటుంది. కొండపైకి చేరుకుని అద్భుతమైన వ్యూ ని చూసేందుకు వీకెండ్స్ లో ఇక్కడికి భారీగా జనం వస్తుండటంతో ప్రమాదకరంగా మారింది.






