ప్రపంచం భారత్‌కు అనుకూలంగా మారుతోంది : ట్రేడ్‌డీల్‌పై మోదీ రియాక్షన్

by Naga Rani Yarlagadda |

అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ పై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. నేడు ఎన్డీఏ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ అంశంపై మంత్రులు, నేతలతో మాట్లాడారు.

ప్రపంచం భారత్‌కు అనుకూలంగా మారుతోంది : ట్రేడ్‌డీల్‌పై మోదీ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ పై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. నేడు ఎన్డీఏ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ అంశంపై మంత్రులు, నేతలతో మాట్లాడారు. భారత్ పై అమెరికా వేసిన టారిఫ్ లతో ఎన్ని విమర్శలొచ్చినా.. ఈ క్షణం కోసమే సహనంతో ఉన్నట్లు తెలిపారు. ఆ సహనమే నేడు దేశానికి మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందన్నారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందం దేశంలో అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందన్నారు. వాణిజ్య పరమైన చర్చలపై ప్రభుత్వ స్థిరమైన వైఖరితో ఉందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. కొన్నాళ్లుగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. భారత్ మాత్రం సహనంతో వాణిజ్యపరంగా లాభాలు పొందుతోందన్నారు.

ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత్ నుంచి ప్రధానంగా ఎగుమతులు చేసే రంగాలకు భారీ లాభాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా ఆక్వారంగానికి ఇది భారీ ఊరటని చెప్పాలి. 60 శాతానికి పైగా రొయ్యలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అందులోనూ ఏపీ నుంచే అధిక ఎగుమతులు ఉంటాయి. గతంలో టారిఫ్ లను పెంచడంతో ఆక్వా రంగం కుదేలయింది. ఇప్పుడు ఆ నష్టాలనుంచి కోలుకునే అవకాశం లభించింది. అలాగే టెక్స్ టైల్, ఫార్మా, ఆటో పార్ట్స్, వ్యవసాయ రంగాలకు కూడా ఈ ట్రేడ్ డీల్ ద్వారా లాభం చేకూరనుంది.

Next Story