- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ ఘటన.. మహిళ ఓటర్ ఐడీ కార్డులో ఆ రాష్ట్ర సీఎం ఫొటో!
రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓటరు ఐడీ కార్డులో స్వల్ప మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మహిళాకి బిగ్ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. బీహార్(Bihar)లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధేపుర మున్సిపాలిటీకి చెందిన అభిలాష కుమారి(30) తన ఓటరు ఐడీ కార్డు లో చిరునామా సవరణ కోసం దరఖాస్తు చేసింది.
చిరునామా సరి చేయబడినప్పటికీ, ఆమె ఫోటో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫొటో ముద్రించబడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె భర్త చందన్ కుమార్ మీడియాతో తెలియజేస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే.. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్ ఐడీ జారీ ప్రక్రియ లో తీవ్ర లోపం ఉందని, దానికి తాజాగా వెలుగు చూసిన ఈ తప్పిదమే ఉదాహరణ అంటూ విమర్శలు చేస్తున్నారు.






