- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chat GPT: నెక్స్ట్ లెవల్ వాడకం.. ఆ పనికి చాట్ జీపీటీని వాడిన మహిళ
చాట్ జీపీటీతో ఓ మహిళ చేసిన పని వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. దైనందిన జీవితాల్లో ఐఏ ప్రభావం చొచ్చుకు వస్తోంది. అందుకు అనుగుణంగానే ఏఐ సాంకేతిక పరిజ్ఞానం సైతం అభివృద్ధి చెందుతోంది. తాజాగా ఓ మహిళ తన రూమ్ ను చాట్ జీపీటీ (Chat GPT) సాయంతో అద్భుతంగా రూమ్ తీర్చిదిద్దుకోవడం వైరల్ గా మారింది. ఇండియన్ వ్యాపారవేత్త, ఏఐ జౌత్సాహికురాలైన కామ్య గుప్తా తన గదిని అందంగా తీర్చిదిద్దుకునేందుకుడు చాట్ జీపీనిని వర్చువల్ ఇంటీరియర్ డిజైనర్ గా (Room Interior Designer) ఉపయోగించారు. తన గది ఫోటోలను చాట్ జీపీటీ ఇచ్చి తన వ్యక్తిగ అభిరుచిని వివరిస్తూ రూమ్ ను ఇంటీరియర్ డిజైన్ ను తీర్చిదిద్దమని కోరింది.
ఆమె కోరినట్లుగా చాట్ జీపీని గదిలో ఏవి ఎక్కడ ఉంచాలి, ఏ కలర్ పెయింట్ ఉపయోగిచాలి అని సలహాలు ఇచ్చింది. ఆమె ఆశించినట్లుగానే ఏఐ అద్భుతమైన రీతిలో ఇంటీరియర్ డిజైన్ సలహాలు ఇవ్వగా అందుకు తగినట్లుగా ఆమె తన గదిని మార్చుకుంది. ఫైనల్ గా ఆ రూమ్ ఆమె అనుకున్నట్లుగా కనిపించడంతో తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. నా తల్లిదండ్రుల కోసం ఇలా చేయడం ఆనందంగా ఉంది. ఏఐకి కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఏఐ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాట్ జీపీటీని గిబ్లి కోసం తెలివిగా ఉపయోగించడం బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.






