అదృశ్యమయిన తాజ్ మహల్.. షాక్ లో పర్యటకులు

by Muthe.Rajitha |

ఆగ్రా లోని తాజ్ మహల్ చూడటానికి వెళ్లిన పర్యటకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అదృశ్యమయిన తాజ్ మహల్.. షాక్ లో పర్యటకులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆగ్రా లోని తాజ్ మహల్ చూడటానికి వెళ్లిన పర్యటకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ వారికి తాజ్ మహల్ కనబడలేదు. రాత్రికి రాత్రి తాజ్ మహల్ అదృశ్యం అవ్వడంతో పర్యటకులే కాదు, స్థానికులు కూడా షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరాదిని తీవ్ర చలి వణికిస్తోంది. చలితోపాటు దట్టమైన పొగమంచు అనేక నగరాలను కమ్మేస్తోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీతోపాటు ఆగ్రా, చంఢీఘర్, హరియాణా రాష్ట్రాలు పొంగమంచు ముప్పును ఎదుర్కొంటున్నాయి. కాగా గత నాలుగురోజుల నుంచి ఆగ్రా నగరాన్ని దట్టమైన మంచు దుప్పటి చుట్టుముట్టింది.

ఉదయం 10 గంటల తర్వాత కూడా 10 మీటర్ల దూరంలో ఉన్నవాళ్లు కనిపించనంత తీవ్రంగా పొగమంచు పేరుకు పోయింది. దీంతో ఉదయం పూట తాజ్ మహల్ కనబడకుండా పోయింది. పూర్తిగా దగ్గరికి వెళ్ళి చూస్తే గాని తాజ్ మహల్ కనిపించక పోవడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా చలి తీవ్రతతోపాటు, భారీ వాతావరణ కాలుష్యం వల్ల ఇలాంటి దట్టమైన పొంగమంచు ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Next Story