- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. పుతిన్ భారత్ పర్యటన ఖరారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఈ మేరకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో పర్యటించబోతున్నట్లుగా క్రెమ్లిన్ (Kremlin) అధికారిక ప్రకటనను ఇవాళ విడుదల చేసింది. 2021 తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌లు గత ఏడాది రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. అదేవిధంగా అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజన్‌లో మరోసారి వీరిద్దరూ ప్రత్యేక భేటీ అయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్, నరేంద్ర మోడీలు భేటీ భారత్, రష్యా సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, తదితర అంశాలపై చర్చించారు.
Next Story






