ఇంకా చీకట్లోనే పేదల జీవితాలు.. ఇదిగో సాక్ష్యం (వీడియో)

by Gantepaka Srikanth |

హిందువులు అత్యంగ గ్రాండ్‌గా జరుపుకునే పండుగల్లో దీపావళి(Diwali) ఒకటి.

ఇంకా చీకట్లోనే పేదల జీవితాలు.. ఇదిగో సాక్ష్యం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు అత్యంగ గ్రాండ్‌గా జరుపుకునే పండుగల్లో దీపావళి(Diwali) ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఇంటి నిండా దీపాలు వెలిగించి.. కొత్త బట్టలు కట్టుకొని.. పటాకులు కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) నగరంలో ఈసారి దీపావళి వేడుకలను మరింత అట్టహాసంగా నిర్వహించారు. 9వ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి ఈ ఏడాది 26.17 లక్షల దీపాలు వెలిగించారు. అదేవిధంగా ఏకకాలంలో 2,128 మందితో హారతీ నిర్వహించారు. ఈ రెండూ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాయి. దీనిని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దీపావళి పండుగ అనంతరం అయోధ్యలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయోధ్యలో దీపోత్సవం ముగిసిన తర్వాత.. దీపాల్లో మిగిలిపోయిన నూనెని స్థానికులు బాటిళ్లలో నింపుకునేందు ఎగబడ్డారు. ఒకరో, ఇద్దరో కాదు.. వందలాది మంది అక్కడికి వెళ్లి నూనె ఎత్తుకెళ్లారు. మన భారతదేశంలో సామాన్యుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీపోత్సవంతో సరికొత్త రికార్డు సృష్టించగలిగారు కానీ.. పేదల జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని.. దానికి ఇదే సాక్ష్యమని కామెంట్లు పెడుతున్నారు. వీడియో

Next Story