- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదంలో 350 కోట్ల వాట్పాప్ వినియోగదారుల భద్రత..?
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగంగా ఏర్పడింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినప్పటికి, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ (WhatsApp) అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగంగా ఏర్పడింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినప్పటికి, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి, విద్యార్థి ఈ వాట్సాప్ ను కచ్చితంగా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల వినియోగదారులు ఉన్నారంటే దీనిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అంచనా వేయవచ్చు. అయితే తాజాగా వాట్సాప్ వినియోగదారుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వియన్నా యూనివర్సిటీ రీసెర్చర్లు ఇటీవలగా వాట్సాప్‌లో ఒక కీలక భద్రతా లోపాన్ని గుర్తించినట్లు సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల వినియోగదారుల కాంటాక్ట్ నంబర్స్ లీక్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హ్యాకర్లు లేదా దురుద్దేశ పూర్వక వ్యక్తులు ఈ కాంటాక్ట్ వివరాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరికల రూపంలో కథనాలు వైరల్ అవుతున్నాయి.
అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వాట్సాప్, వియన్నా యూనివర్సిటీ నుంచి ఇలాంటి భద్రతా లోపంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిశోధన నివేదికలు, టెక్నికల్ డాక్యుమెంట్లు, మీడియా స్టేట్‌మెంట్‌లు ఎక్కడా ప్రచురించబడకపోవడంతో ఈ విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ సైబర్‌భద్రతా సంస్థలూ ఈ హెచ్చరికపై స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని. వాట్సాప్ ఎప్పటికప్పుడు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తోంది. వినియోగదారులు తమ ఫోన్లో తాజా అప్డేట్లు ఇన్‌స్టాల్ చేసుకోవడం, తెలియని యాప్స్‌కు అనుమతులు ఇవ్వకపోవడం, సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్లను సురక్షితంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






