తమిళనాడులో తొక్కిసలాట ఘటన.. ముందే చెప్పిన వ్యక్తి

by Malleboina Mahesh |

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ నిన్న కరూర్ లో చేపట్టిన మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో తొక్కిసలాట ఘటన.. ముందే చెప్పిన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ (Vijay) నిన్న కరూర్ లో చేపట్టిన మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 83 మంది వరకు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉండటం దిగ్భ్రాంతి (Shock) కలిగిస్తుంది. ఈ ఘటన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ ప్రభుత్వం.. ఏకసభ్య కమిషన్ (Single Member Commission) ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఈ విషాద సంఘటనపై కొద్ది రోజుల క్రితమే ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆనంద్ అనే పేరుతో గల ట్విటర్ అకౌంట్లో.. SEP 13న 'ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాట 50 మంది యువత బలయ్యే తొక్కిసలాట ఒక్కటైనా చూస్తాం.

DMK కంటే 10 రెట్లు విషపూరిత, క్రూర, మతిలేని విజయ్ వల్లే ఇది జరుగుతుంది' అని ఆ వ్యక్తి తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. తాజాగా శనివారం సాయంత్రం అతను చెప్పినట్టుగానే ఘోర విషాదం జరిగి ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 83 మంది తీవ్ర గాయాల పాలు అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి చేసిన ట్వీట్ సాధారణంగా చేశారా? లేక పరిణామాలు, పరిస్థితులు గమనించే చెప్పారా? అనే కోణంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం విజయ్ ఆలస్యంగా సభకు రావడమే కారణం అని కొంతమంది వాదిస్తుండగా.. లేదు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తమ అభిమాన నటుడిని చూసేందుకు వెళ్లిన అమాయక ప్రజలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు.

Next Story