ఢిల్లీ పేలుడు.. కారు పాత ఓన‌ర్ అరెస్ట్, 13కి చేరిన మృతుల సంఖ్య

by velandi.Saikiran |

Delhi blast కారును మొదట సల్మాన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ తర్వాత నదీమ్ ఖాన్ అనే వ్యక్తికి విక్రయించారు

ఢిల్లీ పేలుడు.. కారు పాత ఓన‌ర్ అరెస్ట్, 13కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఢిల్లీలో ఎర్రకోట ( Delhi blast) వద్ద జరిగిన భారీ పేలుడు సంఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 13కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అటు ఈ సంఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేశారు. స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి, పరిస్థితిపై ఆరా తీస్తున్నాడు.

LNJP ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు అమిత్ షా. ఇది ఇలా ఉండగా, ఈ కారు పాత ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్ ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు తేల్చారు పోలీసులు. హుండాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగింది. అయితే ఈ కారును మొదట సల్మాన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ తర్వాత నదీమ్ ఖాన్ అనే వ్యక్తికి విక్రయించారు. ఈ నేపథ్యంలోనే నదీమ్ ఖాన్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story