2 వారాలకు ముందే డేట్ ఫిక్స్.. 15 నిమిషాల్లో ఆపరేషన్ క్లోజ్.. ఖమేనీపై దాడి వివరాలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-01 10:22:19  IST  )

సీఐఏ, మొసాద్ పక్కా ప్లాన్ ప్రకారం 15 నిమిషాల్లో ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ అంతం చేసింది.

2 వారాలకు ముందే డేట్ ఫిక్స్.. 15 నిమిషాల్లో ఆపరేషన్ క్లోజ్.. ఖమేనీపై దాడి వివరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ ఖమేనీని (Ayatollah Khamenei) హంతమొందించాలని ఎన్నో ఏళ్లుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా పై చేయి సాధించాయి. తాజాగా ఇరాన్‍పై సంయుక్తంగా నిర్వహించిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఓ వైపు తమతో ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్‍పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తునే మరో వైపు ఉన్నట్టుండి విరుచుకుపడటం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. నెలల పాటు ఖమేనీ కదలికలపై సీఐఏ, మొసాద్ సేకరించిన పక్కా సమాచారంతో ఖమేనీని చంపినట్లు తెలుస్తోంది.

15 నిమిషాల్లో ఎటాక్:

నిఘా సంస్థలు సేకరించిన సమాచారంతో పాటు టెహ్రాన్‍లోని ఆఫీసులో ఖమేనీ ఉన్నట్లు యూఎస్, ఇజ్రాయెల్ నిర్థారణకు వచ్చాయి. శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేశన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా దాడులకు దిగితే ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిస్సైళ్లతో దాడులు జరిపినట్లు తెలిసింది. శనివారం అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'(Operation Epic Fury), ఇజ్రాయెల్ 'ఆపరేషన్ లయన్ రోర్' (Roaring Lion) పేరుతో జరిపిన దాడులు ఇరాన్ మిలటరీ స్థావరాలు మరియు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయనేట్లు పైకి కనిపించాయి. కానీ 'ఆపరేషన్ కిల్ ఖమేని' పేరుతో శనివారం తెల్లవారుజామున 1:15 గంటలకు ఇరాన్‍పై మిస్సైల్స్ తో రెండు దేశాలు ఏకకాలంలో ఎటాక్ చేసినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ దాడి కోసం కొన్ని నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల ముందే డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు. కూలిన భవనంలో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ టార్గెట్‍గా జరిగిన తాజా ఆపరేషన్‍కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతుగా నిలిచాయి.

36 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర : ఖమేనీ ప్రస్థానమిదీ

Next Story