- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ఆ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తుల (devotees) రద్దీ (rush) కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తుల (devotees) రద్దీ (rush) కొనసాగుతోంది. మహా కుంభమేళాను సందర్శించి, త్రివేణి సంగమం (Triveni Sangam)లో పుణ్య స్నానాలు (holy dips) ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ (Prayagraj) కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జాం (huge traffic jam) నెలకొంటున్నది. రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడ వాహనాలు కదలకుండా నిలిచిపోవడంతో భక్తులు గంటల కొద్ది నడి రోడ్ల మీదనే వేచి చూడాల్సి వస్తుంది. ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జబల్‌పుర్ -ప్రయాగ్‌రాజ్ మార్గం (Jabalpur-Prayagraj route)లో వాహనాలు (Vehicles) పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
కుంభమేళా సందర్భంగా పక్కనే ఉన్న కాశీ (Kashi), అయోధ్య (Ayodhya)లకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల మంది భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. దీంతో కాశీలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా.. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని, మధ్యప్రదేశ్ సీఎం (Madhya Pradesh CM) మోహన్‌యాదవ్ (Mohan Yadav) ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ జాం దృష్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తులు దయచేసి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు.
ఇక జనవరి 13న ప్రారంభమైన కుంభమేలా కేవలం 25 రోజుల్లోనే చరిత్రను తిరగరాసింది. ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే మహా కుంభమేలా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. ఒక్క మౌని అమావస్య (Mauni Amavasya) రోజునే 15 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం (UP government) తెలిపింది. ఈ మహా కుంభమేలా ఈనెల 26 తో ముగియనుండగా.. ఆ రోజు పెద్ద ఎత్తున జనసందోహం ఉండే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.






