- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిహద్దులో మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు
by GSrikanth |
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం కొండగావ్ జిల్లా కేజంగ్‌లో సెల్ టవర్‌కు నిప్పు పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం కొండగావ్ జిల్లా కేజంగ్‌లో సెల్ టవర్‌కు నిప్పు పెట్టారు. పరిసర ప్రాంతాల్లోని చెట్లకు జనతన్ సర్కార్ జిందాబాద్ అంటూ పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. ఈ పోస్టర్లను గమనించిన స్థానికులు భద్రతా బలగాలకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మావోయిస్టులపై కదలికపై నిఘా పెట్టారు. కాగా, ఇటీవల కాలంలో మావోయిస్టులకు, పోలీసులకు వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పది మంది వరకు మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు వరుసగా పోలీసులకు లేఖల ద్వారా బెదిరింపులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story






