- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శోకసంద్రంలో సాహితీ లోకం.. రచయిత గూగీ వా థియోంగో కన్నుమూత
ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం, ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని సాహితీ ప్రస్థానంతో కెన్యాను బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్య దేశంగా మార్చిన గూగీ వా థియోంగో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం, ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని సాహితీ ప్రస్థానంతో కెన్యాను బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర దేశంగా మార్చిన గూగీ వా థియోంగో కన్నుమూశారు. 87 ఏళ్ల గూగీ వా వీప్ నాట్, చైల్డ్ అండ్ పెటల్స్ ఆఫ్ బ్లడ్ వంటి ప్రఖ్యాత నవలలతో ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా ఆయన స్థానిక ఆఫ్రికన్ భాషలలో సాహిత్య రచనలను ప్రోత్సహించారు. బ్రిటీష్ వలస పాలనలో జైలుపాలైన ఆయన దేశ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. నోబెల్ బహుమతికి గూగీ వా థియోంగో పలుమార్లు నామినేట్ అయినా.. ఆ పురస్కారం అతడిని వరించకపోవడం దురదృష్టకరం.
సోదరుడి మరణం..
1938లో కెన్యాలోని జేమ్స్ థియోంగో గూగీ వా లిమురులో ఓ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బ్రిటిష్ మిషనరీలు నడిపే అలయన్స్ బోర్డింగ్ స్కూల్లో విద్యను అభ్యసించారు. మావు మావు తిరుగుబాటు (1952-1960) ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో బ్రిటీష్ పాలకులు ఆయన గ్రామాన్ని సర్వనాశనం చేశారు. అనంతరం జేమ్స్ థియోంగో గూగీవా కుటుంబంతో పాటు గ్రామస్థులందరినీ నిర్బంధ శిబిరాలకు తరలించారు. జేమ్స్ థియోంగో గూగీవా సోదరుడు గిటోగో, బ్రిటిష్ సైనిక ఆదేశాలను అతిక్రమించినందుకు నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చేశారు. అసలు జరిగిందేమిటంటే గిటోగో చెవిటివాడు కావడంతో వారిచ్చిన ఆదేశాలు వినబడక ప్రాణాలు కోల్పోవడం గూగీవాను కొన్నేళ్ల పాటు బాధించింది.
1959లో ఉగాండాలోని మేకరెరె విశ్వవిద్యాలయంలో చేరిన జేమ్స్ థియోంగో గూగీవా తన తొలి నవలను వీప్ నాట్, చైల్డ్ను నైజీరియన్ రచయిత చినువా అచెబె ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన సాయంతో 1964లో ప్రచురించారు. అయితే, ఆ నవల తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి ప్రధాన ఆంగ్ల నవలగా ప్రసిద్ధి చెందింది. ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్, ది రివర్ బిట్వీన్ నవలలతో జేమ్స్ థియోంగో గూగీవా ప్రశంసలు అందుకున్నారు. 1972లో 33 ఏళ్ల వయసులో ఆయనను ఆఫ్రికా అత్యుత్తమ రచయితగా యూకె టైమ్స్ పేర్కొంది.
జేమ్స్ నుంచి గూగీ వా థియోంగోగా..
1977 జేమ్స్ థియోంగో గూగీవా జీవితంలో కీలక సంవత్సరం. ఆయన తన పేరును జేమ్స్ నుంచి గూగీ వా థియోంగోగా మార్చుకున్నారు. ఆంగ్ల భాషను వదిలి తన మాతృభాష కికుయులో నవలలు రాయడం ప్రారంభించారు. పెటల్స్ ఆఫ్ బ్లడ్, స్వతంత్ర కెన్యా నాయకులను విమర్శిస్తూ ఆయన చివరి ఆంగ్ల నవలగా నిలిచింది. అదే సంవత్సరం, న్గాహికాందీంద (ఐ విల్ మ్యారీ వెన్ ఐ వాంట్) నాటకం కెన్యా తరగతి సంఘర్షణను చిత్రించింది, దీనిని జోమో కెన్యాట్టా ప్రభుత్వం నిషేధించి, న్గూగీని ఒక సంవత్సరం జైలులో బంధించింది. అక్కడ, టాయిలెట్ పేపర్‌పై ఆయన తన తొలి కికుయు నవల డెవిల్ ఆన్ ది క్రాస్ రాశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత, డానియల్ అరప్ మోయి ప్రభుత్వంలో కెన్యాకు తిరిగి వచ్చేందుకు హత్యా కుట్ర గురించి తెలిసిన గూగీ, యూకే, యూఎస్‌లో 22 సంవత్సరాల స్వీయ నిర్బంధ జీవితం గడిపారు. 2004లో కెన్యాకు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించినప్పటికీ.. కొదరు ఆయన భార్యపై దారుణంగా దాడి చేశారు. ఆ పరిణామామాన్ని గూగీ వా థియోంగో ‘రాజకీయం’ అంటూ కామెంట్ చేశారు.
యేల్, న్యూయార్క్, కాలిఫోర్నియా ఇర్విన్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేసిన గూగీ వా థియోంగో ఆఫ్రికన్ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించారు. డీకలనైజింగ్ ది మైండ్ అనే రచనలో ఆంగ్లంలో రాసిన చినువా అచెబెను గూగీ వా థియోంగో విమర్శించారు. దీంతో వారి మధ్య స్నేహం దెబ్బతింది. ఆయనకు రెండు వివాహాలు కాగా.. ఓ భార్య విడాకులు తీసుకున్నారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం ఉన్నారు. అందులో నలుగురు రచయితలు. ఆయన కుమారుడు ముకోమా వా గూగీ తన తల్లిపై శారీరక దాడి ఆరోపణలు చేయగా గూగీ వా థియోంగో స్పందించలేదు.
‘గైడింగ్ లైట్ ఇన్ అమెరికన్ లిటరేచర్’..
2019లో గూగీ వా థియోంగోకి ట్రిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం కిడ్నీ ఫెయిల్ అవ్వడం, 1995లో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడిన గూగీ అనారోగ్య సమస్యలను కూడా అధిగమించారు. నైజీరియన్ రచయిత చిమమంద న్గోజీ అడిచీ ఆయనకు ‘గైడింగ్ లైట్ ఇన్ అమెరికన్ లిటరేచర్’ అని బిరుదు ఇచ్చారు. గూగీ వా థియోంగో మరణంతో సాహితీ లోకం ఒక గొప్ప కాంతిని కోల్పోయింది, కానీ ఆయన రచనలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.






