- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మురిద్కేలో లష్కరే రహస్య స్థావరం నేలమట్టం.. ఆ ఇద్దరూ హతమైనట్లేనా?
పీవోకే కేంద్రంగా ఉగ్రవాదుల శిబిరాలపై భారత భద్రతా దళాలు మెరపు దాడులు చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: పీవోకే కేంద్రంగా ఉగ్రవాదుల శిబిరాలపై భారత భద్రతా దళాలు మెరపు దాడులు చేశాయి. మొత్తం ఏకకాలంలో 9 చోట్ల చేసిన వైమానికి దాడుల్లో మొత్తం 30 మంది తీవ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా మురిద్కేలోని నిషేధిత ఉగ్రవాద గ్రూపులైన జైష్-ఎ-మొహమ్మద్ (JM), బహవల్పూర్‌లోని లష్కర్-ఎ-తోయిబా (LET) ప్రధాన కార్యాలయాలు, మదర్సాను భారత సైన్యం ధ్వంసం చేసినట్లుగా పాక్ మీడియా వెల్లడించింది. ఇందులో ఆ రెండు సంస్థలకు చెందిన చాలామంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. కానీ, కీలక నేతలైన మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరణించినట్లుగా ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, దాడికి సంబంధించి వివరాలను వెల్లడించేందుకు ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అందులో మసూద్ అజార్ మరణంపై ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, లష్కర్-ఎ-తోయిబాకు లోహోర్ శివారు ప్రాంతమైన మురిద్కే భారీ ఆస్తులు ఉన్నాయి. అక్కడా ఓ భారీ కాంప్లెక్స్‌ను కూడా నిర్వహిస్తుంది. అందులో ఎక్కువగా ఉగ్రకార్యకలాపాలే జరుగుతాయని అమెరికా సైన్యం ఇప్పటికే ధృవీకరించింది. ఒకవేళ ఆ కాంప్లెక్స్‌ను నేలమట్టం లష్కర్-ఎ-తోయిబాకు నిధులు ఆగిపోతాయి. ఆ విషయాన్ని తెలుసుకున్న భారత సైన్యం మురిద్కే కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (JM), లష్కర్-ఎ-తోయిబా (LET) ప్రధాన కార్యాలయాలు, అక్కడే మదర్సాపై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేసింది.
ముంబై దాడులకు అక్కడే పథక రచన..
2008లో ముంబై దాడులకు సంబంధించి మురిద్కేలోని ఆ కాంప్లెక్స్ నుంచే మానిటరింగ్ జరిగిందని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. లష్కర్ చీఫ్ హాఫీజ్ సయిద్ కూడా లహోర్‌లోని అత్యంత ఖరిదైన ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి ఇంటి చుట్టూ భారీ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా అప్పట్లో పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మదర్సాలు
పాక్‌లోని అనేక మదర్సాలకు ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్‌మెంట్‌తో పాటు రాడికలైజేషన్ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. లష్కర్-ఎ-తోయిబా, లఖ్ర్ ఏ ఝంగ్వీ, తెహ్రీక్ ఎ తాలిబాన్‌లోని మస్తుంగ్, ఖజ్దార్ పట్టణాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఆ సంస్థలన్నీ మదర్సాలను ఏర్పాటు చేసి అందులో ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇక పాక్ ఆధీనంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని బహవల్పూర్‌లో జైష్ ఎ మహమ్మద్ భారీ స్థావరాన్ని నిర్వహిస్తుంది. ఇది మసూద్ అజహర్ నాయకత్వంలో ట్రైనింగ్ రిక్రూట్‌మెంట్ కేంద్రాలుగా నివేదికలు ఉన్నాయి. ఆ స్థావరం కూడా స్థానికంగా మదర్సాగా గుర్తింపు పొందింది. పుల్వామా దాడికి ఇక్కడే ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
మసూద్ అజార్ విధ్వంసాలు ఇలా..
ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఖాట్మాండూ-ఢిల్లీ IC 814 విమామాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ప్రయాణికులను కాపాడేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భయకరమైన ఉగ్రవాది మసూద్ అజార్‌తో సహా ముగ్గుర ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. 1999లో విడుదలైన మసూద్ అజార్ బహవల్‌పూర్ కేంద్రంగా జైషే-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రారంభించాడు. అనంతరం అతడి నేతృత్వంలో భారత్‌పై వరుస దాడులు జరిగాయి. అందులో 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటు దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడులు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిన మసూద్ అజార్, ఏప్రిల్ 2019 నుంచి ప్రజలకు దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ఆఫ్ఘనిస్తాన్‌లోని సీనియర్ తాలిబన్ నాయకులు ఒసామా బిన్ లాడెన్, పాకిస్తాన్‌లోని వివిధ సున్నీ సెక్టారియన్ గ్రూపుల మద్దతుతో అతను జనవరి 2000లో టెర్రర్ గ్రూప్‌ను స్థాపించాడని అధికారులు తెలిపారు. లాహోర్ నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న మురిద్కే, 1990 నుంచి హఫీజ్ సయీద్ నాయకత్వంలో LET ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






