- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతిపెద్ద రిఫైనరీ అరామ్‌కోనే టార్గెట్.. మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి
సౌదీ అరేబియాలోని అరామ్‌కోకు చెందిన అతిపెద్ద రిఫైనరీ ‘రాస్ తనురా’పై మరోసారి డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరామ్‌కో (Aramco)కు చెందిన అతిపెద్ద రిఫైనరీ ‘రాస్ తనురా’ (Ras Tanura)పై ఇవాళ ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. ఈ విషయాన్ని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. సోమవారం ఇరాన్ తయారీ ‘షాహెద్’ (Shahed) సూసైడ్ డ్రోన్లతో జరిగిన దాడి కారణంగా అరామ్‌కో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ఇవాళ తాజాగా జరిగిన దాడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫస్ట్ అటాక్ తర్వాత అరామ్‌కో ఇప్పటికే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG), ప్రోపేన్, బ్యూటేన్ ఎగుమతులను కొన్ని వారాల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది.
మరోవైపు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా చమురు రవాణా ప్రమాదకరంగా మారడంతో, సౌదీ అరేబియా తన ఎగుమతులను రెడ్ సీ (Red Sea) మీదుగా తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బుధవారం 1.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 82.53 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే.






