- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Australia: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఖలీస్థానీ గ్రూప్ గందరగోళం.. పౌరుషం చూపిన ఇండియన్స్
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఖలీస్థానీయులు రెచ్చిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence Day) వేళ ఖలీస్థానీయులు రెచ్చిపోయారు. స్వాతంత్య్ర వేడుకల్లోకి చొరబడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆస్ట్రేలియాలోని (Australia) కాన్సులెట్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. మెల్ బోర్న్ లోని కాన్సులేట్ కార్యాలయం వద్ద 79వ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలను నిర్వహించుకునేందుకు భారతీయులు అక్కడికి చేరుకున్నారు. దేశభక్తి గీతాలతో జాతీయ పతాకావిష్కరణకు సిద్దమయ్యారు. ఇంతలో కొందరు ఖలిస్థానీలు చొరబడి అక్కడ గందరగోళం సృష్టించారు. తమ వెంట తెచ్చుకున్న జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. ఖలీస్థానీ మూకకు (Khalistani Group) పోటీగా భారతీయులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పోలీసులు అక్కడ ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం 'భారత్ మాతాకి జై.. 'వందేమాతరం' నినాదాల మధ్య అక్కడే భారతీయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.






