ఆ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు.. తీవ్రంగా ఖండించిన సీఎం.. కేంద్రంపై ఫైర్

by Sujitha Rachapalli |

‘ది కేరళ స్టోరీ’ చిత్రం రెండు నేషనల్ అవార్డులు పొందింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేరళలోని మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఐఎస్ఐఎస్‌లో చేర్చడాన్ని గురించి వివరిస్తుంది. రిలీజ్ సమయంలోనే ఎన్నో నిరసనలు ఎదుర్కొన్న ఈ చిత్రానికి 71వ

ఆ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు.. తీవ్రంగా ఖండించిన సీఎం.. కేంద్రంపై ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రెండు నేషనల్ అవార్డులు పొందింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేరళలోని మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఐఎస్ఐఎస్‌లో చేర్చడాన్ని గురించి వివరిస్తుంది. రిలీజ్ సమయంలోనే ఎన్నో నిరసనలు ఎదుర్కొన్న ఈ చిత్రానికి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు రావడంపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేరళకు తీవ్రమైన అవమానంగా వర్ణించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ చిత్రం.. రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని.. సొసైటీలో విద్వేషాన్ని రెచ్చగొడుతుందని పేర్కొన్నారు. సంఘ్ పరివార్ విభజన భావజాలానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్న జ్యూరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని కోరారు.

ప్రతిపక్ష నాయకులు వి.డి. సతీషన్ కూడా సీఎం పినరయి విజయన్ అభిప్రాయాన్ని సమర్థించారు. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ అవార్డులను మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వాడుతుందన్నారు. బీజేపీ, సంఘ్ పరివార్ కేరళ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయ లాభం పొందేందుకు చూస్తున్నాయని ఆరోపించారు.

LINK

Next Story