అరేయ్ ఏంట్రా ఇదంతా.. క్లాస్ రూమ్‍లోకి 'ఐ ఫోన్ లంచ్ బాక్స్'.. స్టూడెంట్ పనికి అంతా షాక్

by Prasad Jukanti |   (  Updated:2025-11-27 07:44:05  IST  )

ఐఫోన్ లంచ్ బాక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

అరేయ్ ఏంట్రా ఇదంతా.. క్లాస్ రూమ్‍లోకి ఐ ఫోన్ లంచ్ బాక్స్.. స్టూడెంట్ పనికి అంతా షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐ ఫోన్లకు (iphone) ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ సంస్థ నుంచి ఏ కొత్త సీరిస్ మొబైల్ లాంచ్ అయినా కొనేందుకు స్టోర్ల ముందు కస్టమర్లు బారులు తీరుతుంటారు. ఈ ఐఫోన్లను దక్కించుకోవాలనే కోరిక ఉన్నా అంత డబ్బులు లేక కిడ్నీలు అమ్ముకున్న ఘటనలు ఉన్నాయంటే కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి‌ పీక్స్‌కు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అదరిని ఆకర్షించే ఈ ఐఫోన్ విషయంలో తాజాగా ఓ విద్యార్థి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్‍లో ఐ ఫోన్ బాక్స్ తో (iphone box) వచ్చిన ఓ స్టూడెంట్ ను తరగతి గదిలో ఉన్న టీచర్ అందులో ఏముందని ప్రశ్నిస్తుంది. దాంతో అందులో పరోటా ఉందని సదరు విద్యార్థి బదులిస్తాడు. దాంతో అతడు జోక్ చేస్తున్నాడేమో అని భావించిన టీచర్ ఫోన్ బాక్స్ తెరిచి చూపించాలని అడుగుతుంది. ఆ విద్యార్థి ఓపెన్ చేయగా అందులో పేపర్‍లో చుట్టిన పరోటాలు ఉన్నాయి. దాంతో ఎవరు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారని టీచర్ అడగగా తానే స్వయంగా ఇలా ప్యాక్ చేసుకున్నానని చెప్పాడు. అలా చేయమని ఎవరు చెప్పారని నిలదీయడంతో ఆ విద్యార్థి మౌనంగా ఉండిపోయాడు. ఇది లంచ్ బాక్సా అంటూ టీచర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సీన్ చూసేందుకు తోటి విద్యార్థులంతా అక్కడ గుమ్మిగూడగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ టీచర్ కోపగించుకోగానే విద్యార్థులంతా తమ తమ స్థానాల్లోకి పరుగులు పెట్టారు. ఐఫోన్ బాక్స్ ను లంచ్ బాక్స్ గా మార్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రీతుల్లో రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ ఈ స్టూడెంట్ దేశి జుగాడ్ లెవల్ ప్రో మ్యాక్స్ అల్ట్రా అని ప్రశంసించగా మరి కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన టీచర్ తీరును తప్పుబడుతున్నారు. మొత్తంగా ఐ ఫోన్ బాక్స్ ను లంచ్ బాక్స్ గా (lunch box) మార్చిన ఈ బాలుడి తెలివితేటలు గ్రేట్ అంటూ కొందరు ఇదేం పనంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. వీడియో

Next Story