మంచు తెరల మధ్య మాయాజాలం.. కొడైకెనాల్‌లో మంచు అందాలు ఇవే..

by Ramesh Naini |

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్ ప్రస్తుతం మంచు దుప్పటితో ముస్తాబై సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

మంచు తెరల మధ్య మాయాజాలం.. కొడైకెనాల్‌లో మంచు అందాలు ఇవే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్ ప్రస్తుతం మంచు దుప్పటితో ముస్తాబై సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కొండకోనలను తాకుతూ నెమ్మదిగా కదులుతున్న మంచు తెరలు పాలకడలిని తలపిస్తూ అద్భుత దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. ప్రత్యేకించి సూర్యోదయ వేళ మంచు తెరల మధ్య నుంచి సూర్యకిరణాలు తొంగిచూస్తున్న దృశ్యం చూసిన వారికి జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతిని కలిగిస్తోంది. చల్లని గాలులు, పచ్చని అడవులు, మబ్బుల్లో మునిగిపోయిన లోయలు కలిసి కొడైకెనాల్‌ను స్వర్గధామంలా మార్చాయి.

ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మంచు కమ్మిన మార్గాల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ పర్యాటకులు ప్రకృతితో మమేకమవుతున్నారు. అదే సమయంలో స్థానిక అధికారులు పర్యాటకులకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటూ, ట్రాఫిక్ నియంత్రణ, వసతి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులు, కుటుంబ పర్యాటకులకు ఇది కొడైకెనాల్‌ను సందర్శించేందుకు సరైన సమయం అని పర్యాటక నిపుణులు సూచిస్తున్నారు. వీడియో ఇదే..

Next Story