‘భర్తను కొ** అని పిలవడం తప్పే’.. హైకోర్టు కీలక తీర్పు

by Gantepaka Srikanth |

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. కానీ, ఆ గొడవల్లో కొన్ని అనకూడని బూతులు మాట్లాడి.. ఇష్యూను తీవ్రతరం చేసుకుంటుంటారు.

‘భర్తను కొ** అని పిలవడం తప్పే’.. హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. కానీ, ఆ గొడవల్లో కొన్ని అనకూడని బూతులు మాట్లాడి.. ఇష్యూను తీవ్రతరం చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆ గొడవలు కేసుల వరకూ వెళ్లడం మనం చూస్తుంటాం. తాజాగా.. ఇలాంటి ఘటనే హర్యానా(Haryana)లో చోటుచేసుకుంది. అయితే, ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో 2017లో వివాహమైన దంపతులు మధ్య విభేదాలతో కొంతకాలం తర్వాత భర్త విడాకులు కోరాడు. తన భార్య తరచూ పోర్న్ వీడియోలు చూసేదని.. రోజూ తనను శారీరకంగా బలవంతం చేసేదని.. తాను ఒత్తిడిలో ఉండి తనను సంతృప్తి పరచలేని క్రమంలో ‘కొ** గాడివి, వేరే వాళ్లని పెళ్లి చేసుకుంటా’ అని వెక్కిరించేదని భర్త పిటిషన్లో రాసి విడాకులు కోరాడు. దీనిపై కింది స్థాయి కోర్టు విడాకులు ఇవ్వగా, భార్య పంజాబ్ అండ్‌ హర్యానా హైకోర్టులో సవాలు చేసింది.. పంజాబ్ అండ్‌ హర్యానా హైకోర్టు కూడా కింది స్థాయి కోర్టును సమర్ధిస్తూ భర్తకు విడాకులు ఇప్పించారు.

Next Story