ప్రభుత్వం కీలక నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో అలా చేస్తే భారీ ఫైన్!

by Jakkula.Mamatha |

పశ్చిమ బెంగాల్(West Bengal) ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో  అలా చేస్తే భారీ ఫైన్!
X

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్(West Bengal) ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు(Tobacco), పాన్ మసాలా(pan masala) నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రధాన సమస్యల్లో ఒకటిగా చెప్పవచ్చు. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో (public places) పొగాకు(Tobacco) లేదా పాన్ మసాలా(pan masala) నమలడం.. ఉమ్మివేయడం వంటి అలవాటు ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా రాబోయే బడ్జెట్(Budget) అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meetings) అటువంటి నేరాలకు భారీ(Heavy) ఆర్థిక జరిమానా(financial penalty) విధించే నిబంధనలతో కూడిన బిల్లు(Bill)ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్(West Bengal) మంత్రివర్గ సమావేశం(Cabinet meeting)లో ఈ బిల్లుపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి చట్టం(Act) ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వ(Bengal Govt) వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. పర్యావరణ కాలుష్య సమస్యలను నియంత్రించడానికి పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (WBPCB)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మండలి, పర్యావరణ చట్టాలు, నియమాలు, శాసనాలు, న్యాయపరమైన ప్రకటనలను అమలు చేస్తుంది.

Next Story