- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ హయాంలోనే రామమందిర శంకుస్థాపన.. పవార్ కీలక వ్యాఖ్యలు
రామమందిర శంకుస్థాపన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే జరిగిందని, ఇప్పుడు రాముడి పేరిట భాజపా, ఆరెస్సెస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరం గురించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిర శంకుస్థాపన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే జరిగిందని, ఇప్పుడు రాముడి పేరిట భాజపా, ఆరెస్సెస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. కర్ణాటకలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన పవార్ ఈ తరహ వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో 11 రోజుల అనుష్ఠాన దీక్ష చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. దీనిపై స్పందించిన శరద్ పవార్, రాముడిపై ప్రధానికి ఉన్న విశ్వాసాన్ని గౌరవిస్తానని, కానీ పేదరిక నిర్మూలన కోసం ఉపవాసం చేసి ఉంటే.. ప్రజలు దాన్ని అభినందించేవారని పేర్కొన్నారు. కాగా దీన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చేశారని ఆరోపించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తమ పార్టీ నేతలు హాజరుకావడం కష్టమేనని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ తదితరులూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఇదివరకే నిర్ణయించున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని పవార్ గతంలోనే వెల్లడించారు.






