ఆ రైతు వార్షిక ఆదాయం రూ.3.. వైరల్ అవుతున్న అధికారుల ధ్రువపత్రం

by Muthe.Rajitha |

మధ్యప్రదేశ్ లో ఓ రైతు ఆదాయం ఏడాదికి రూ.3 మాత్రమేనని అధికారులు ధ్రువపత్రం జారీ చేసారు.

ఆ రైతు వార్షిక ఆదాయం రూ.3.. వైరల్ అవుతున్న అధికారుల ధ్రువపత్రం
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ లో ఓ రైతు ఆదాయం ఏడాదికి రూ.3 మాత్రమేనని అధికారులు ధ్రువపత్రం జారీ చేసారు. ఇది కాస్త మీడియాలో వైరల్ అవడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. పొరపాటును సరి చేస్తూ మరో ధ్రువపత్రం జారీ చేసారు. మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లా కోఠి మండలానికి చెందిన రామ్ స్వరూప్ ఇటీవల ఆదాయ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధికారులు జారీ చేసిన ధ్రువపత్రంలో ఆ రైతు ఏడాది ఆదాయం రూ.3 గా పేర్కొన్నారు.

దీంతో ఈ వార్త కాస్త మీడియాలో వైరల్ అయింది. పాపం ఆ రైతు నెల ఆదాయం 25 పైసలేనా అంటూ... ఈ దేశంలో అత్యంత బీద వాడు ఇతనే అంటూ కామెంట్స్ చేయడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆ రైతు ఆదాయ ధ్రువ పత్రాన్ని మార్చి ఇచ్చారు. ఈసారి రూ. 30 వేల ఆదాయం ఉందని పేర్కొన్నారు.

Next Story