- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Explosion: ఢిల్లీ హై అలర్ట్..పేలుడు ఏం జరిగిందంటే, వీడియో వైరల్
ఢిల్లీ హై అలర్ట్..పేలుడు ఏం 13 మంది మరణించగా మరో ఆరు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మరో పెను ప్రమాదం జరిగింది. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ( Blast In Delhi) భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర పార్కు చేసిన కారులో భారీ బ్లాస్టింగ్ జరిగింది. ఈ పేలుడు సంభవించిన నేపథ్యంలో పక్కన ఉన్న ఐదు కార్లు కూడా ధ్వంసం అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మరణించగా మరో ఆరు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ ఆరుగురి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ బ్లాస్టింగ్ జరగక ముందు అక్కడ ఉన్న పరిస్థితుల వీడియో వైరల్ గా మారింది. ఎర్రకోట సమీపంలోనే కొంత మంది ఢిల్లీ వాసులను ఓ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగింది. దీంతో అక్కడ ఉన్న జనాలు పరుగులు పెట్టారు. కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. క్లిక్






