- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్.. హయత్ హోటల్స్ చైర్మన్ థామస్ ప్రిట్జ్కర్ రాజీనామా
ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదంతో హయత్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ థామస్ ప్రిట్జ్కర్ తన పదవికి రాజీనామా చేశారు. పాత సంబంధాలపై విచారం వ్యక్తం చేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎప్‌స్టీన్ ఫైల్స్ (Epstein Files) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖుల పేర్లు ఇందులో బహిర్గతమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హయత్ హోటల్స్ (Hyatt Hotels) ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బిలియనీర్ థామస్ ప్రిట్జ్కర్ (Thomas Pritzker) పేరుకు కూడా బయటకు వచ్చింది. దీంతో ఆయన తన పదవికి, బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాలపై వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) అతడి గర్ల్‌ఫ్రెండ్ గిస్లైన్ మాక్స్‌వెల్‌తో పరిచయాలు పెంచుకుని తాను తప్పు చేశానని థామస్ ప్రిట్జ్కర్ అంగీకరించారు. 2008లో జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక నేరస్థుడిగా నిర్ధారణ అయిన తర్వాత కూడా అతడితో ప్రిట్జ్కర్ ఈ-మెయిల్ ద్వారా సంభాషణలు జరిపినట్లుగా ఇటీవల బయటపడిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో వెల్లడైంది.
కాగా, జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితురాలైన వర్జీనియా గిఫ్రే (Virginia Giuffre) 2016లో ఇచ్చిన ఒక డిపాజిషన్‌లో ప్రిట్జ్కర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఎప్‌స్టీన్ తనను ప్రిట్జ్కర్ వద్దకు పంపించాడని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రిట్జ్కర్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్‌స్టీన్, మాక్స్‌వెల్ వల్ల బాధితులకు జరిగిన అన్యాయానికి తాను ఎంతగానో విచారిస్తున్నానని అన్నారు. వారితో సంబంధాలు కొనసాగించినందుకు ఎటువంటి సాకులు చెప్పనని పేర్కొన్నారు. హయత్ హోటల్స్ ప్రయోజనాల దృష్ట్యా తాను అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని థామస్ ప్రిట్జ్కర్ స్పష్టం చేశారు.






