ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం..! మల్లికార్జున ఖర్గేకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-18 05:44:45  IST  )

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణ (CP Radha Krishna) ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం..! మల్లికార్జున ఖర్గేకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కోరినట్లుగా సమాచారం. అయితే, ఇండియా కూటమి మాత్రం అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులే గడువు మాత్రమే ఉంది. 22న నామినేషన్ల పరిశీలించనున్నారు. 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించి అదే రోజుల ఫలితాన్ని వెల్లడించనున్నా. ప్రస్తుతం రాజ్యసభ, లోక్‌సభలో 786 ఎంపీలు ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే 394 మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎకగ్రీవం కోసం రాజ్‌నాథ్ సింగ్‌ ఫోన్ చేసిన తరుణంలో ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.

కాగా, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ (67) పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బీజేపీ హెడ్ ఆఫీసులో కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అంతకు ముందు ఆయన ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

Next Story