డాక్టర్ అతి తెలివి.. ఫెవిక్విక్ తో ట్రీట్మెంట్

by Muthe.Rajitha |

నుదుటి మీద చిన్న గాయానికి బ్యాండేజ్ వేయాల్సిన డాక్టర్ అతితెలివితో ఫెవిక్విక్ తో వైద్యం చేసిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.

డాక్టర్ అతి తెలివి.. ఫెవిక్విక్ తో ట్రీట్మెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : నుదుటి మీద చిన్న గాయానికి బ్యాండేజ్ వేయాల్సిన డాక్టర్ అతితెలివితో ఫెవిక్విక్ తో వైద్యం చేసిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జస్పిందర్ సింగ్ కుమారుడు ఆడుతూ టేబుల్‌కు గుద్దుకోగా నుదుటిపై గాయం అయింది. వెంటనే బాలుని తల్లి భాగ్యశ్రీ సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్ రక్తం ఆపేందుకు గాయానికి ఫెవీక్విక్ వేసి వైద్యం చేశారని దంపతులు ఆరోపించారు.

పిల్లాడి ఇబ్బంది చూసి మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు 3 గంటలు కష్టపడి గాయాన్ని శుభ్రం చేసి 4 కుట్లు వేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ నిర్లక్ష్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story