Internet Addiction Treatment Center : దేశంలో తొలి ఇంటర్నెట్ వ్యసన నివారణ చికిత్స కేంద్రం..ఎక్కడో తెలుసా ?

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-27 05:53:31  IST  )

దేశంలో విద్యార్థులు..యువత సహా సాధారణ పౌరులు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న(Smart phone users) నేపథ్యంలో ఇంటర్నెట్, టెక్నాలాజీ వ్యసనపరు(Internet Addictioners)లు కూడా పెరిగిపోతున్నారు.

Internet Addiction Treatment Center : దేశంలో తొలి ఇంటర్నెట్ వ్యసన నివారణ చికిత్స కేంద్రం..ఎక్కడో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో విద్యార్థులు..యువత సహా సాధారణ పౌరులు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న(Smart phone users) నేపథ్యంలో ఇంటర్నెట్, టెక్నాలాజీ వ్యసనపరు(Internet Addictioners)లు కూడా పెరిగిపోతున్నారు. ఫోన్ వ్యససం బారిన పడి మానసిక బ్యాలెన్స్ తప్పుతున్న కొందరు పిల్లలు..యువతియువకులైతే పదే పదే ఫోన్ చూడొద్ధంటూ పెద్దలు ఎవరైన మందలిస్తే వారి అంతుచూడటమో లేక తామే బలవన్మరణాలకు పాల్పడటమో చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటర్నెట్, టెక్నాలాజీ వ్యసనాల బారిన పడిన వారి చికిత్స కోసం దేశంలోనే తొలి చికిత్స కేంద్రాన్ని(First Internet Addiction Treatment Center) ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంగణం(AIIMS campus in Delhi)తో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ ను అతిగా వాడే పిల్లలు, టీనెజర్లలో మానసిక సమస్యలు వస్తున్నాయని 2024-25ఆర్థిక సర్వే తేల్చింది. ఈ సమస్యల నుంచి పిల్లలను కాపాడేందుకు పాఠశాల, కుటుంబాల స్థాయి నుంచి చొరవ తీసుకోవాలని సర్వే సూచించింది.

అతిగా ఫోన్, ఇంటర్నెట్ వాడే వ్యసానాన్ని మాన్పించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ఢిల్లీ ఎయిమ్స్ ప్రాంగణంలో సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ఆన్ ఎడిక్టీవ్ బిహేవియర్స్ (CARAB) పేరుతో ఓ చికిత్స కేంద్రం ఏర్పాటుకు అనుమతించింది. రూ.14కోట్ల వ్యయంతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా వ్యవస్థాపకులు యతన్ పాల్ సింగ్ బల్హరా వెల్లడించారు.

ఇందులో ఇంటర్నెట్ వ్యసనాన్ని నివారించి, చికిత్స చేయడానికి విద్యా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని..తెలిపారు. ఇంటర్నెట్ వ్యసనం బారిన పడే ప్రమాదం ఉన్న వారిని ముందే గుర్తించేందుకు కృత్రిమ మేధ(AI) సాంకేతికతను కూడా వినియోగించనున్నట్లుగా వెల్లడించడం విశేషం.

ఇంటింటా ఇప్పుడు ఇంటర్నెట్‌ రాజ్యమేలుతోంది. సాంకేతిక విప్లవం పుణ్యమా టన్నుల కొద్దీ సమాచారం సెకన్లలో కంప్యూటరీకరణ చెందుతుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సామాజిక సైట్లతో గంటల కొద్ది ఇంటర్నెట్ కు అతుక్కుపోతున్నారు. ఇంటర్నెట్‌ మీద ఎక్కువసేపు గడిపేవారిలో ఇతరత్రా మానసిక వ్యాధులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అన్న సందేహ నివృత్తి కోసం కొందరు కెనడా పరిశోధకులు ఓ 254 మందిని విద్యార్థులను ఎన్నుకున్నారు. అలా ఎన్నుకొన్నవారిలో ఇంటర్నెట్ వాడకాన్ని పరిశీలించారు.

ఈ 254 మందిలో ఓ 33 మందిలో ఇంటర్నెట్‌ పట్ల విపరీతమైన వ్యసనం ఉన్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ వ్యసనం ఉన్న వారు రకరకాల శారీరక, మానసిక సమస్యల పాలవుతున్నట్లుగా గుర్తించారు. విపరీతమైన క్రుంగుబాటు, ఉద్వేగం, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి ఇబ్బందులను వారు ఎదుర్కొన్నట్లు తేలింది. అలాగే ఒక 56 శాతం విద్యార్థులు వీడియోలకి సంబంధించిన సైట్లకి అతుక్కుపోతున్నారట. 48 శాతం మంది విద్యార్థులైతే సోషల్‌ మీడియా సైట్లను వదిలి ఉండలేకపోతున్నారని.. విద్యార్థులలో 29 శాతం మంది ఇన్‌స్టంట్ మెసేజింగ్ సైట్లకు అతుక్కుపోతున్నారని పరిశోధనలో తేలింది.

మొత్తం మీద ఇంటర్నెట్‌ ఓ వ్యసనంగా ఉన్నవారిలో 42 శాతం మంది నానారకాల మానసిక ఇబ్బందులనూ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారి కోసం ఇంటర్నెట్ వ్యసన నివారణ చికిత్స కేంద్రం ఎంతో ప్రయోజనకరంగా మారనుందనడంలో సందేహం లేదు.

Next Story