రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం కాలరాస్తోంది.. సీఎం స్టాలిన్‌ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-15 07:02:56  IST  )

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Government).. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, విద్య, ఆరోగ్య రంగాలను క్రమంగా కాలరాస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM MK Stalin) తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం కాలరాస్తోంది.. సీఎం స్టాలిన్‌ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Government).. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, విద్య, ఆరోగ్య రంగాలను క్రమంగా కాలరాస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM MK Stalin) తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురువేసిన ఆయన రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల విభజనలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రాలు తమ హక్కుల కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని గౌరవించడం భారతదేశ అభివృద్ధికి కీలకమని అన్నారు. న్యాయపరమైన, రాజకీయ పోరాటాలతోనే తిరిగి రాష్ట్ర అధికారాలను సొంతం చేసుకోవాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఆ కమిటీ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేస్తుందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

Next Story