- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ మహిళా నేత దారుణ హత్య.. ఏకంగా తలను వేరు చేసి అతి కిరాతకంగా
బీజేపీ (BJP) మహిళా నేతను అతి కిరాతంగా హతమార్చిన భయానక ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) మహిళా నేతను అతి కిరాతంగా హతమార్చిన భయానక ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై సెంట్రల్ (Madhurai Central) నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకురాలుగా ఉన్న శరణ్య (Sharanya) సోమవారం రాత్రి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమెను దుండగులు వెంటాడి వేటాడి వేట కొడవళ్లతో తలను వేరు చేసి అతికిరాతంగా అంతమొందించారు. దీంతో శరణ్య అక్కడికక్కడే రక్తపు పడి కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అయితే, సరిగ్గా ఏడాది క్రితం మధురై పర్యటనలో భాగంగా శరణ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ మంత్రిగా ఉన్న పళబివేల్ త్యాగరాజన్ (Palabivel Thyagarajan) కారు మీద చెప్పులు విసిరింది. అ కేసులో శరణ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కట్ చేస్తే.. సోమవారం రాత్రి దుంగడుల చేతిలో దారుణ హత్యకు గురికావడం పలు అమనుమాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పొలిటికల్ మర్డరా.. లేక వ్యక్తిగత తగాదాలతోనే ఎవరైనా శరణ్య హత్య చేశారా.. అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు శరణ్య హత్యకు నిరసనగా పలు చోట్ల బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.






